Categories
స్వీట్ తినాలనే కోరిక నుంచి తప్పించుకోలేక పోతు ఉంటారు. దానికి కారణం ఒత్తిడి, అలసట, నిద్రలేమి అంటారు శక్తి తగ్గినప్పుడు శరీరానికి తక్షణ శక్తి కోసం తీపి పైకి మనసు పోతోంది. శరీరం యాక్టివ్ గా లేనప్పుడు బద్దకంగా అనిపిస్తుంది యాక్టివిటీ ఉంటేనే తీపి తినాలనే కోరిక కంట్రోల్ అవుతుంది. షుగర్ క్రేవింగ్ కు డీహైడ్రేషన్ కూడా మరో కారణం. శరీరం లోని నీటి శాతం తగ్గితే కూడా షుగర్ తినాలనిపిస్తుంది. ఒకవేళ తీపి తినాలి అనిపిస్తే డార్క్ చాక్లెట్ రెండు ముక్కలు తీసుకోవడం చిలకడదుంపలు స్వీట్ కార్న్ ఖర్జూరాలు బెస్ట్ ఆప్షన్. రెండు ఖర్జూరాలు రెండు ఆప్రికాట్స్ నాలుగు ఎండు ద్రాక్ష ఎండు అంజీర్ ఇలా ఏదో ఒకటి తినొచ్చు.