తమన్నా నిస్సందేహంగా పాలరాతి సుందరి. మరి ఈ మండే ఎండల్లో షూటింగ్ తప్పదు .షూటింగ్ లు తప్పదు మరి ఈ ఎండకి చర్మం కమిలిపోకుండా ఎలా కాపాడు కుంటావు అని అడిగితే, నేను అయితే  కొబ్బరి నీళ్ళు పాలమీగడ కలిపి తీసుకొంటాను అన్నది. ఎండల్లో డీహైడ్రేషన్ భారీ నుంచి కొబ్బరి నీళ్ళు రక్షిస్తాయనీ, అలాగే పాల మీగడ కూడా తీసుకొంటానని ఇందు వల్ల వంట్లో కొవ్వు ఎంత మాత్రం పెరగదని మంచి శరీరాకృతితో ఉండేందుకు పాలమీగడ చక్కగా ఉపయోగపడుతుందని చెపుతోంది తమన్నా. కాకపోతే గంటల కొద్దీ జిమ్ లో శరీరం కరిగేలా చేస్తుంది కనుక తిన్నా పర్లేదనుకొండి.

Leave a comment