కోవిడ్ వాక్సిన్ గర్బిణీలకి, పాలిచ్చే తల్లులకు సురక్షితం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటన తర్వాత, మహిళలు గర్భం దాల్చే ఆలోచనను వాయిదా వేసుకుంటే మంచిదని అంటున్నారు గైనకాలజిస్టులు. గర్భం దాల్చిన తర్వాత వ్యాక్సిన్ వేయించుకునే వీలు లేదు గర్భధారణ కనీసం రెండు నెలల పాటు వాయిదా వేసుకోమంటున్నారు. గతంలో రుబెల్లా వాక్సిన్ రూపొందిన ప్రారంభంలో ఎదుర్కొన్న పరిమాణాలను పరిగణలోకి తీసుకోమని చెపుతున్నారు డాక్టర్లు. గతంలో ఈ వ్యాక్సిన్ తీసుకొన్న గర్భవతుల్లో గర్భస్థ పిండానికి వైరస్ సోకిన దాఖలాలున్నాయి ఫలితంగా కంటి చూపు వినికిడి లోపాలు మానసిక వైకల్యాలను పిల్లలు పుడుతూనే వెంట తెచ్చుకున్నారు. ఇలాంటి పొరపాటు జరగకుండా వ్యాక్సిన్ కోసం గర్భధారణ వాయిదా వేసుకోమని సలహా ఇస్తున్నారు.

Leave a comment