జీవితం లో ఏదైనా అనుకోని గుర్తింపు దొరికితేనే ఆత్మవిశ్వాసం కలుగుతుంది. గతంలో అనుభవించిన అవమానాలు కష్టాలు అప్పుడే తొలగిపోతాయి.అప్పటి వరకూ భరించిన జీవితం ఉన్నట్లుండి మారిపోయి ఇంకో కొత్త జీవితం దొరుకుతుంది అచ్చం నా జీవితంలో ఇలాగే జరిగింది అంటోంది మధురిమా తులి. ఈ ఒడిశా అమ్మాయి డెహ్రాడూన్ లో చదువుకుంది బాలీవుడ్ నటి అయ్యింది టీవీ సీరియల్స్, బిగ్ బాస్ 13 మొదలైన వాటిలో ఎంతో గుర్తింపు తెచ్చుకుంది.  ఒక ఇంటర్యూ లో మాట్లాడుతూ తనకు ఇంగ్లీష్ మాట్లాడటం రాదని  డ్రెస్ సెన్స్ లేదని డెహ్రాడూన్ లో నా తోటి పిల్లలు ఏడ్పించే వాళ్ళు నేను మిస్ ఉత్తరాంచల్ అవగానే నా జీవితం మారిపోయింది అందరిలో ఎంతో గౌరవం స్నేహం దక్కాయి అంటుంది మధురిమా తులి.

Leave a comment