తాటి గెలల నుంచి వూరే రసాన్ని నీరా అంటారు. మంచి వాసన రంగుతో తియ్యగా వుంటుంది. పులిస్తే కల్లు అంటారు. ఈ నీరా మంచి తాటి బెల్లం తయారు చేస్తారు. ఈ బెల్లంలో తేమ 8.61 శాతం, సుక్రోజు 7686, రెడ్యుసింగ్ చక్కర 1.66, కొవ్వు 0.19, మంసాకృతులు 1.04, కాల్షియం 0.86, ఖనిజాలవనాలు, ఇనుము వంటి పోషక విలువలుంటాయి. స్త్రీల లో, పిల్లల్లో రక్తహీనత తగ్గిస్తుంది. శరీరానికి చల్లదనం ఇస్తుంది. తక్కువ పొటాషియం, ఎక్కువ చక్కర ఉంటాయి. ఔషధాల తయారీ లో వాడుతారు. పటిక బెల్లం, పంచదార మాములు బెల్లం బదులుగా ఈ తాటిబెల్లం చాక్లెట్ల నుంచి వివిధ తీపి పదార్ధాల తయ్యారీలో వాడుకోవచ్చు. పంచదారకు బదులు ఈ తాటి బెల్లం పొడిని వాడుకోవచ్చు.

Leave a comment