అమెరికా వాళ్ళు మంచిగా తినండి కలిసి తినండి అంటుంటే సింగపూర్ లో దేశవ్యాప్తంగా మీ కుటుంబం తో కలిసి తినండి అనే రోజు జరుపుకుంటున్నారు. కుటుంబ సంబంధాలకు ఏ దేశమైన ఇచ్చే ప్రాధాన్యత ప్రాముఖ్యత ఇదే ఇంట్లో తాజాగా వండిన పదార్ధాల్లో పోషకాలుంటాయి. చక్కెర కొవ్వులు ఉప్పు అతి తక్కువగా వుంటాయి. మంచి నీళ్ళే టేబుల్ పైన వుంటాయి. కుటుంబంలో అందరూ  కలిసి కూర్చుని తింటే ఏ కాస్త తిన్నా హోటల్లో లాగా ఇరవై పదార్ధాల మెనూ లేకపోయినా మనసు శాంతంగా ఉంటుంది. ఇదే పండగ రోజొస్తే పిలల్లు సంతోషించేలా ఇంట్లో డైనింగ్ టేబుల్ ని కొత్తగా అలంకరించి కుదిరితే మెనూ కార్డు కూడా అమర్చి పండగ కోసం వండిన రకరకాల పదార్ధాల తో నింపేయచ్చు. మొబైల్స్ లాప్ టాప్స్ కాసేపు అవతలపెట్టి పండగ కోసం ఎవరెలా ఊహించారో సాయంత్రం ఎలా గడపాలనుకున్నారో ఇష్టమైన వారికీ ఎలాంటి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నారు. అందరూ కలిసి చర్చించుకుంటూ భోజనం చేస్తే అదే రోజూ వచ్చే పండగ. తీరిక లేనంత వృత్తి ఉద్యోగాలున్న వారంలో రెండు రోజులైనా లేదా ప్రతిరోజు సాయంత్రమన్నా కుటుంబం మొత్తం కలిసి కూర్చుని భోజనం చేస్తే ఈ కుటుంబం మనది వీళ్లంతా మనవాళ్ళు అని పిలల్లకు చెప్పకుండానే తెలిసిపోతుంది. ఈ భోజనానికి మొదటి అతిధి ఇంట్లో వున్న వయసు మళ్ళిన వాళ్లే  మరచి పోవద్దు.

Leave a comment