ఆనందం ఇచ్చే ఆహారం కూడా వుందండీ.. కొన్ని పదార్ధాల్లో వుండే హ్యాపీనెస్  హార్మోన్స్ ని ఉత్తేజం చేసే రసాయనాలు మూడ్ మార్చేస్తాయి . ఎండార్ఫిన్ రసాయనాల ఫీల్ గుడ్ భావన ని కలిగిస్తుంది. ఏదైనా నొప్పి కలిగినా దాన్నించి ఉపశమనం కలిగించేది ఇదే. చాకోలెట్స్ సీ విటమిన్ ఉండే నిమ్మ నారింజ స్ట్రా బెర్రీస్ ఎండార్ఫిన్ స్రావానికి ఉపయోగపడతాయి. తియ్యని ద్రాక్ష లో కూడా ఎండార్ఫిన్స్ వుంటాయి. మాంసాహారం గుడ్లు చేపలు సీ ఫుడ్స్ లో వుండే ప్రోటీన్లు డోపమైన్ ను స్రవించేలా చేసే మంచి మూడ్ బూస్టర్. అలాగే చాక్లేట్ లోని సినైల్ శిధిలమైన మూడ్ ని ఆహ్లాదంగా మార్చేస్తుంది. అలాగే పాలలోని ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ ఆహ్లాదకరమైన భావన ఇస్తుంది. గోరువెచ్చని పాలు తాగితే సుఖంగా నిద్ర వస్తుంది. విటమిన్ B6 లభించే పొత్తు తో ఉండే ఆహార ధాన్యాలు బఠానీలు  కాలీఫ్లవర్ అవకాడోలతో పాటు విటమిన్ B12 వుండే కాలేయం కిడ్నీ తాజా మాంసం క్యాబేజీ బ్రొకోలీ వంటివి సెరిటోనిన్ స్రవించేందుకు తోడ్పడతాయి. ఇది నేరుగా దొరకాలంటే పైనాపిల్ అరటిపండు తిని చుస్తే సరి.

Leave a comment