శరీర దుర్గందానికి కారణం సరైన ఆహారం తీసుకోకపోవడం కూడా ఒకటి అంటారు న్యూట్రిషనిస్టులు . వేసుకొనే దుస్తులు వాడే సబ్బులు ,పెర్ఫ్యూమ్ వల్ల వాసనలు పోతాయి . కానీ శరీర శుభ్రత ఒక్కటే శరీర దుర్గంధాన్ని డిసైడ్ చేస్తుంది . ప్రతిరోజు ఆహారంలో పండ్లు కూరగాయలు తీసుకోవటం డ్రై ఫ్రూట్స్ విధిగా ఆహారంలో భాగంగా ఉండటం ,తీపిపదార్దాలు తిన్నా వెంటనే నోరు శుభ్రం చేసుకోవటం వంటి వి పాటించాలి రెండుపూటలా దంతాలు శుభ్రం చేసుకొవాలి . ఎక్కువ కొవ్వు ఉన్నా పదార్దాలు తిన్నా మందులు ఇన్ పెక్షన్ ల వల్ల కూడా నోటి దుర్వాసన అనిపిస్తుంది కారణం తెలుసుకొని సరైన జాగ్రత్తలు పాటించాలి . జీర్ణాశయం సవ్యంగా పనిచేసేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి . ఆహారం ,వ్యాయామం,నిద్ర లాగా మనిషికి శరీర శుభ్రత ముఖ్యం .

Leave a comment