ప్రతి రోజు బరువు చూసుకొంటూ ఉంటే అధిక బరువు తేలిగ్గా తగ్గి పోతుంది అంటున్నారు యూనివర్సిటీ అఫ్ జార్జియా పరిశోధికులు. సాధారణంగా ఎవరైనా సంవత్సరానికి అరకిలో నుంచి కిలో వరకు బరువు పెరుగుతారు . ఊబకాయుల్లో ఈ పెరుగుదల ఇంకా ఎక్కువ. పరిశోధనలో కొన్ని వందల మందిపై ఈ చిట్కా ప్రయోగించారు . ప్రతి రోజు బరువు చూసుకుంటే మనలో బరువు పట్ల ఆలోచన పెరుగుతుంది. తినే భోజనం, వ్యాయమం గురించి శ్రద్ధ పెరిగి ప్రతి రోజు బరువు చూసుకొని కాస్త పెరిగిన అమిత శ్రద్ధ తో దాన్ని తాగించుకొనే ప్రయత్నం చేస్తున్నారని పరిశోధికులు కనిపెట్టారు. అంచేత బరువు తగ్గలంటే రోజు బరువు చెక్ చేసుకోండి అంటున్నారు.

Leave a comment