ఎన్ని రకాల ఫ్యాషన్ లు వస్తున్నా, వేసవిలో మాత్రం పప్డ్ స్లీవ్స్ ఓటేస్తారు అమ్మాయిలు వీటినే బుగ్గ చేతులు అంటారు. చిన్నవిగా అయినా పెద్దవిగా అయినా  పప్డ్ స్లీవ్స్ లో ఎంతో ఫ్యాషన్ గా కనిపిస్తారు. ఎప్పుడో రాజుల కాలం నాటి ఈ స్లీవ్స్ ఇప్పటికీ యువతరాన్ని ఆకర్షిస్తూనే ఉన్నాయి. ఇవి లెహంగా పైన చక్కగా మ్యాచ్ అవుతాయి. బరువు తక్కువ ఉండే జార్జెట్ చీర కు జోడీగా  పప్డ్ స్లీవ్స్ బ్లవుజ్ వేసుకుంటే ప్రత్యేకంగా కనిపిస్తారు. ఇలా ప్రత్యేకమైన స్లీవ్స్ ఉన్న దుస్తులు ధరిస్తే ఇతర యాక్ససరీస్ తో కూడా పని ఉండదు. ఈ స్లీవ్స్ గొప్ప ఫ్యాషన్ స్టేట్ మెంట్స్.

Leave a comment