ఇవ్వాల్టి ఫ్యాషన్ ట్రెండ్ లో జుట్టుకు రంగులు అద్దటం కూడా ఒకటి.అలా ఎర్రని జుట్టు కావాలనుకొన్న లేదా ఇప్పుడే ఒకటి అలాగా వస్తున్నా తెల్లజుట్టు దాచేయటానికైనా ఇంట్లో తయారు చేసిన హెన్న ఉపయోగపడుతుంది. అరకప్పు తాజావి లేదా ఎండినవి బంతిపూలు ,రెండు స్ఫూన్లు మందార పూవులు ,గోరింటాకు పొడి కావాలి .నీరు వేడి చేసి బంతి పూలు మందార పూలు కలిపి బాగా మరిగించి ఆ నీళ్ళను వాడకట్టుకొని ఈ నీటిలో గోరింటాకు పొడి కలిపి తలకుపట్టించి ఓ గంట తరువాత కడిగేస్తే చాలు ఎర్రని జుట్టు కనిపిస్తుంది ఇది తెల్ల జుట్టును కప్పేస్తుంది.ఫ్యాషన్ కోసం హెయిర్ డై లాగా పని చేస్తుంది.

Leave a comment