దక్షిణ భారతీయుల ప్రాచీన వంటకం ఇడ్లీ. మల్లెపువ్వుల్లాంటి ఇడ్లీలకు తోడుగా, సాంబారు, చట్నీలు, కందిపోడులతో ఎలాంటి వారికైనా నొరూరింపోతుంది. ఇడ్లీ పిండిని పులియ బెట్టె తీరు వల్ల పిండి పదార్ధాలు సింపుల్ షుగర్స్ గా మారి తేలికగా జీర్ణం అవ్వుతాయి. పప్పులు ధన్యాల కలయిక వల్ల ప్రోటీన్లు నాణ్యత పెరుగుతుంది. ఇవి పూర్తి స్థాయి ఆహారంగా కూడా ఉపయోగ పడతాయి. కొవ్వు శాతం తక్కువే ఇడ్లీ  లో నెయ్యి వేసుకుని తినడం వల్ల శక్తి పెరుగుతుంది. పులియబెట్టే క్రియ వల్ల బికాంప్లెక్స్, విటమిన్-సి పెరుగుతాయి. ఇవి రుగ్మతలతో పోరాడెందుకు చాలా అవసరం. ఇవి ఆవిరి పై ఉడికిస్తారు కనుక బయట తిన్నా పెద్దగ నష్టం ఎం లేదు. ఒకే సారి పిండి తయ్యారు చేసుకుని ప్రిజ్ లో ఉంచుకున్నా రెండు మూడు రోజుఅల వరకు బాగానే వుంటుంది. ఈ పిండిలో చిటికెడు ఫ్రూట్ సాల్ట్ కలిపి ఉడికిస్తే ఇడ్లీలు మృదువుగా వస్తాయి. బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఇడ్లీలు సందేహించకుండా తినొచ్చు.

Leave a comment