ఢిల్లీలో జరిగిన ఒక ఫుడ్ వర్క్ షాప్ లో మనం తినే ఆహారంలోని రిఫైన్డ్ ,ఫ్రాసెస్డ్ పదార్థాలు కడుపులో ఉండే బాక్టీరియాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయన్నారు. చక్కని జీర్ణవ్యవస్థకి,వ్యాధుల నుంచి శరీరాన్ని కాపాడుకొనేందుకు మంచి బ్యాక్టీరియా అవసరం . ఈ బ్యాక్టీరియాను రక్షించుకోవటం కోసం పూర్తి స్థాయి పోషకాహారంతో పాటు డైట్ లో పులియబెట్టిన పదార్థాలను భాగం చేసుకోమన్నారు. మంచి బ్యాక్టీరియా కడుపులో ఉండాలంటే ఇడ్లీ,దోసె, ఊతప్ప వంటివి అల్పాహారాల్లో తప్పని సరిగా ఉండాలి.

Leave a comment