పాపాయి పుట్టాక వెంటనే పిల్లలు వద్దనుకుంటే బ్రెస్ట్ ఫీడింగ్ చక్కని గర్భ నిరోధక పద్దతి అంటున్నాయి అధ్యయనాలు. ప్రసవం తర్వాత పిల్లలకు పూర్తిగా తమ పాలను పట్టిస్తే అనేక హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి. దీనివల్ల అండోత్పత్తి జరగదు. రుతుక్రమాన్ని ఆలస్యం చేసేందుకు ప్రొలాక్టిన్ కారణం అవుతుంది. ప్రసవం తర్వాత ఈస్ట్రోజన్, ప్రోజిస్టిరన్ కొన్ని హార్మోన్లలో తేడాలుంటాయి. నెమ్మదిగా పాలివ్వడం తగ్గుతూ ఉంటే రుతు క్రమం సాధారణ స్థాయికి వచ్చేస్తుంది. అయితే పాలిచ్చే సమయంలో కూడా గర్భం వచ్చే అవకాశం ఉండవచ్చు కాబట్టి వైద్యుల సలహాలు మిగతా గర్భ నిరోదక పద్దతులు పాటించాలని అద్యయనాలు చెబుతున్నాయి.

Leave a comment