లిఫ్ట్ అంటే ఒక వంద అంతస్తుల వరకు ఉంటుందని ఊహించవచ్చు కానీ ఏకంగా 1070 అడుగుల పొడవున్న లిఫ్ట్ ఉహించగలమని చైనా లోని హునాన్, ప్రావిన్స్ లోని బైలాంగ్ ఎలివేటర్ ఎత్తు చూస్తే నోటి మాట రాదు. ఇదో ఇంజనీరింగ్ అద్భుతం ప్రపంచం లో అత్యంత పొడవున్న అవుట్ డోర్ లిఫ్ట్ ఇదే. ఇందులో డబుల్ డెక్ కాబిన్స్ ఉంటాయి. ఒక్క దాన్లో 50 మంది ఎక్కచ్చు గాజు స్టీల్ తో చేసే ఈ కాబిన్ నుంచి చూస్తే ప్రకృతి అద్భుతంగా ఉంటుంది. జాంగ్జియాజీ నేషనల్ ఫారెస్ట్ పార్క్ పర్వతం పై మూడు గంటలు పట్టే ప్రయాణాన్ని లిఫ్ట్ ద్వారా ఒకటిన్నర నిముషంలో వెళ్లిపోవచ్చు. పర్యాటకులు ఇక్కడికి డే టూర్ గా వస్తుంటారు.

Leave a comment