చర్మం అందంగా ఉండాలంటే ఐదు విషయాలు పాటించాలిట. మొదట క్లీనింగ్ చేయాలి , దానితో అదనపు మురికి కాలుష్యాలు పోతాయి. డిహైడ్రేషన్ కు సంబంధించి చర్మం మిగతా వాటికి భిన్నం కాదు. చర్మం లో చాలినంత తేమ ఉంటేనే చర్మం మృదువుగా ఉంటుంది. చర్మాన్ని ఒమేగా -త్రీ ఒమేగా-౬ ఫ్యాటీ యాసిడ్స్ చర్మాన్ని అందంగా ఉంచుతాయి. సన్ ప్రొటెక్షన్ తప్పనిసరి. చర్మాన్ని అనేక రుగ్మతలనుంచి మాత్రమే కాక వృద్ధాప్య లక్షణాల నుంచి కూడా కాపాడుకోవాలి. ఎస్ పి ఫ్ 15 నుంచి ఉన్న సన్ స్క్రీన్ వాడాలి. విటమిన్ సి చర్మాన్ని బిగుతుగా ఉంచుతుంది. పూర్తి స్ధాయి ధాన్యాలు , సెరల్స్ , యాపిల్ , సిట్రస్ పండ్ల లో సి విటమిన్ పుష్కలంగా వుంటింది. కణాల మెంబ్రేన్స్ ను కాపాడే విటమిన్ ఈ , వీట్ జెర్మన్ ఆయిల్ , బాదాం పీనట్ బట్టర్ లో లభిస్తుంది.

Leave a comment