Categories
WhatsApp

ఐ.జి.ఐ సర్టిఫికెట్ అడిగి తీసుకోండి.

వజ్రాన్ని మించిన దృఢమైన మేలు జాతి రాయి ఇంకోటి లేదు. అందానికి అందం, హుందాతనం ఉట్టి పడుతూ ఆకర్షణీయంగా కనిపించే డైమోండ్  జ్యువెలరీ, మన్నిక కూడా ఎక్కువే. అలాగే బంగారం తో పోలిస్తే వజ్రాల నగల పైన పట్టే పెట్టుబడి ఎప్పటికి వృధా కాదు. బంగారు నగలు మర్పించేస్తే కొంత నష్టం వస్తుంది. వజ్రాల నగలు మార్పిడి చేసిన తరుగు మేకింగ్ చార్జీలు మినహా పెట్టి డబ్బు నూటికి నూరు శతం చేతికి అందుతుంది. వజ్రాలు, రంగు క్లారిటీ పరంగా ధర నిర్ణయిస్తారు. క్లారిటీలో వివివిస్. ఈఎఫ్ అనే రెండు రకాలుంటాయి. వీటిలో VVSEF అనే వజ్రాలు ఒక్క కారెట్ ధర 62 వేల రూపాయిలు నగల దుకాణాల్లో USGH క్వాలిటీ వజ్రాలు కూడా అమ్ముతారు. వీటి నాణ్యత తక్కువ. అంచేత వజ్రాలు నగలు కొనేటప్పుడు అవి ఏ రకానికి చెందినవి అడిగి తెలుసుకోవాలి. అలాగే నగల మన్నిక నాణ్యతకు సంబందించిన ఐజిఐ సర్టిఫికెట్ కూడా అడిగి తీసుకోండి.

Leave a comment