సరికొత్త సాంకేతిక ఒక గొప్ప సమస్యకు అద్భుతమైన పరిష్కారం చూపెట్టింది. ఇప్పటి వరకు గర్భ నిరోధానికి మందులు వాడటం,లూప్స్ వేయించుకోవటం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకోవటం వంటిదే పాటిస్తున్నారు.ఇప్పుడు జార్జియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు కొన్ని నగలు రూపోందించారు. ఉంగరం ,వాచ్,నెక్లెస్, ఇయర్ రింగ్స్ రూపంలో ఉన్న ఈ నగల్ని ధరిస్తే ఈ నగల్లో గర్భనిరోధకానికి ఉపయోగపడే హార్మోన్ లను ఓ పట్టీ రూపంలో పొందు పరచటం వల్ల ఇక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవసరం లేదంటున్నారు . ఈ నగల్ని ట్రాన్స్ డెర్మల్ ఫ్యాబ్ టెక్నాలజీతో రూపొందించాము అంటున్నారు శాస్త్రవేత్తలు.

Leave a comment