ఈ హోం మేడ్ క్రీమ్ మచ్చల్ని విజయవంతంగా మాయం చేస్తుంది. క్యారెట్, నిమ్మకాయ, బంగాళదుంప తీసుకొని కడిగి తడి లేకుండా తుడిచి మెత్తగా తురుముకోవాలి. దాన్ని 24 గంటల పాటు ఒక గిన్నెలో వేసి మూత పెట్టాలి. ఆ తర్వాత ఆ తురుము లోంచి నీరును వేరు చేసి అందులో మూడు స్పూన్ల అలోవెరా జెల్ కాస్త బాదం నూనె కలిపి క్రీమ్ తయారు చేసుకోవాలి. దీన్ని గాజు సీసాలో స్టోర్ చేసి ఫ్రిజ్ లో పెట్టి వారం రోజులు వాడుకోవచ్చు. ఈ క్రీమ్ ప్రతిరోజు ముఖానికి రాసుకుంటే చాలా త్వరగా మంచి ఫలితం కనిపిస్తుంది.

Leave a comment