న్యూజిలాండ్ లో ఒక్క కరోనా కేస్ కూడా లేదని చెప్పగానే నేను చిన్నగ డాన్స్ చేశానంటే నమ్మండి అంటున్నారు జసిందా ఆర్డెన్. 150 సంవత్సరాల న్యూజిలాండ్ చరిత్రలో అతి పిన్నవయసు ప్రధాని ఆమె ప్రపంచం మొత్తం కరోనా కేస్ లతో అల్లాడు తుంటే న్యూజిలాండ్ మాత్రం కరోనా ను తరిమేసిన మొదటి దేశంగా నిలిచింది . ఆ విజయం వెనక అద్వితీయమైన కృషి చేసింది ఆ దేశ ప్రధాని జసిందా.ప్రజల సహకారం,సమష్టి కృషితో కరోనా మహమ్మారికి సంకెళ్లు వేశారామె. టివి షో నిర్వాహకుడు క్లార్క్ గేఫోర్డ్ ను పెళ్లి చేసుకొని ఆడబిడ్డకు జన్మ ఇచ్చారు. ఆరువారాల ప్రసూతి సెలవుల తర్వాత బిడ్డను భర్తకు అప్పగించి పార్లమెంట్ కు వచ్చారు. మూడు నెలల బిడ్డతో ఐక్య రాజ్యసమితి సమావేశానికి హాజరై ఎంతో మంది మహిళలకు రోల్ మోడల్ గా నిలిచారు.

Leave a comment