Categories
Nemalika

ఇక్కడంతా క్షేమం. మీరు క్షేమమా?

నీహారికా,

సుభాషితాలు వినడం చదవడం ఎప్పుడు మనకు లాభమే మంచి మాట మన సత్రువర్తన కు మార్గం వేస్తుంది. గాంధీ ఏమన్నారంటే, క్షమించటం మన బలహీరత కాదుఅది మన శక్తి . అసింహ పిరికి వాళ్ళ ఆయుదం కాదు. అది ధైర్య వంతుల కోసం అన్నారు. నిజంగానే క్షమించమని అడగటం  ఎంత కష్టం తప్పు మనదైనా దాన్ని వప్పుకుని ఎదుటి వారికీ సారీ చెప్పడం ఎదో ఆత్మాభిమానం దెబ్బతిన్నట్లు ఆలోచిస్తాం కాణీ, ఒక చిన్న మాట పోరపాటు వల్ల మనుష్యుల మధ్య అగాదాలు సృస్టించబడటం కన్నా, ఒక్క మాటతో స్నేహపు వారధి కట్టచ్చు. సాధారణంగా ఇద్దరి మధ్యా చిన్న వాగ్వివాదం వస్తే ఆ సమయంలో మనం ఏం మాట్లాడెం, మన ప్రతి క్రియ  ఎలా వుంది. అని జ్ఞాపకం తెచ్చుకుంటే సగం గొడవ సర్దుమనుగుతుంది. అందుకే పెద్ద వాళ్ళు ‘శాతం’ అంటారు.  ప్రేమ, ఇష్టం, మమకారం ఇవన్నీ మనకు తెలిసి వచ్చేలా ఎన్నో సుభాషితాలు మాట్లాడుతారు. అవి మనకు మార్గాన్ని నిద్దేశిస్తాయి శాంతిగా బతికేలా చేస్తాయి. ఇపుడో చక్కని మాట గుర్తు చేయినా ‘బావున్నారా?’ ఎంత మంచి పలకరింపు మంచిపదం. ఎదుటి వాళ్ళ మోహంలో నవ్వు విచ్చుకుని ‘బావున్నాం మీరు బావున్నారా’ అని సమాధానం తిరిగివస్తుంది, ఏమంటావు.

Leave a comment