పబ్లిక్ స్థలాల్లో తినటం వల్ల కరోనా వచ్చే ప్రమాదం మరింత పెరుగుతోంది అంటున్నారు అధ్యయనకారులు మాస్క్ లు పెట్టుకునే ఆఫీస్ లకు, జిమ్ లకు వెళ్లే వాళ్ళు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లు వాడేవారు,సలూన్ లకు వెళ్లేవాళ్ల కంటే తరచూ రెస్టారెంట్ లో భోజనం చేసే వాళ్ళు కోవిడ్ వచ్చిన వాళ్లు ఎక్కువని అంటున్నారు అధ్యయనకారులు.హోటళ్ల లోపల వెంటిలేషన్ లేకపోవటం,ఎ సి లో ఉండటం తినటానికి తాగేందుకు మాస్క్ తీసేయటం వంటి కారణాల వల్ల కోవిడ్ బారిన పడుతున్నారని చెబుతున్నారు.ఆరుబయట ఆరు అడుగుల దూరంలో టేబుళ్లు వేయమని హెచ్చరిస్తోంది డిసీజ్ కంట్రోల్ బోర్డ్.పబ్లిక్ స్థలాలలో తినేప్పుడు జాగ్రత్త అని హెచ్చరిస్తోంది.

Leave a comment