కొంగు ,బోర్డర్ డిజైన్ చూడగానే ఒకప్పుడు ఇది ఇక్కత్ పట్టు అని తెలిసి పోయేది . ఇప్పుడు ఎన్నో రకాల కొత్త డిజైన్ లతో ఇక్కత్ పట్టు చీరెలు కనివిందు చేస్తున్నాయి . చీరె మొత్తం జరీ గళ్ళు ,పూర్తి కాంట్రాస్ట్ కలర్ అంచులు కొంగులు ఇక్కత్ అందం పూర్తిగా మారిపోయింది . చక్కని మోటిఫ్ లు వెడల్పాటి అంచులోచ్చాయి . చీరె మొత్తం పటోలా డిజైన్స్ పరుచుకొంటున్నాయి. ఇక బ్లాక్ కలర్ ఇక్కత్ పట్టు చీరెలకు తిరుగేలేదు . మెరిసె వెడల్పాటి అంచుతో కాంట్రాస్ట్ కొంగుతో నల్లని పట్టు చీరెలు ఏ సందర్భంలో అయినా కట్టుకోవచ్చు . ఇక ఎప్పటిలా తెలుపు ,పాల తెలుపు తో బ్యూటీలు,పూల అంచులతో ఇక్కత్ ఇవాళ్టి ఫ్యాషన్ ట్రెండ్ అయిపోయింది . కాస్త ఆధునికమైన లుక్ కావాలన్న ఇక్కత్ పట్టు కోసం చూడచ్చు .

Leave a comment