రోజు మూడు నుంచి ఐదు నిమిషాల పాటు రొటీన్ కు భిన్నంగా చిన్న చిన్న మార్పులు చేయూస్కుంటే మనమెంతో విశ్రాంతిని పొందగలుగుతాం. ఆ కొత్తదనం  విసుగును మాయం చేస్తుంది. మెదడు రోజువారీ గందరగోళం నుంచి బయటపడి విశ్రాంతిగా ఉంటుంది. ముందుగా ఫోన్ చెక్ చేసుకోవటం కొద్ది సేపు ఆపండి లేదా రెండు మూడు గంటలపాటు ఎయిర్ ప్లేన్ మోడ్ లో ఉంచండి. ఓ వారంలో రెండు రోజులు ఇల్లంతా శుభ్రం చేసుకోవటం పై మనసుపెట్టి ఆ రెండు రోజులు బయట  భోజనం ఎంజాయ్ చేయండి. అతిధులు ఇంటికొచ్చినా  మనం కష్టపడి చేసిన పనులు శుభ్రంగా ఉండే ఇల్లు ప్రత్యేకంగా వాళ్ళకోసంగా ఉండే టవల్స్ సోప్స్ చూసి మనం ఆదరణ కు ఫిదా అయిపోతారు. ఇంట్లో అందరూ కలిసి కాసేపు టీవీలు గేమ్స్ సెల్ ఫోన్లు లాప్ టాప్ లు శుభ్రంగా ఆపేసి హాయిగా హలో వండిన వన్నీ  పరుచుకుని కబుర్లతో సగం భోజనంతో కడుపు నింపుకోండి. రెండు వారాలకు రోజు ఇంటికి భోజనానికి స్నేహితులనో  బంధువులనో పిలవండి. ఒక్క రోజు కాస్త పనిఎక్కువైన మార్పుగా ఉంటుంది. వీకెండ్ ఒక్కరోజు సినిమాకో అప్పుడప్పడూ గాలి విలువ వాసనొస్తున్నా  సరే హుస్సేన్ సాగర్ మీదకు చుట్టూ మనుషుల్ని గమనిస్తూ కాలక్షేపం చేయండి. మనం జీవితం నవ నవ్యంగా మనమే వుంచుకోలేకపోతే ఇంకోళ్ళు ఇవన్నీ ఎందుకు చేసిపెడతారు?

Leave a comment