మన పనులు అవ్వాలంటే పరిగెడుతూనే ఉండాలి. అయినా బయటికి వెళ్ళాలంటే కాస్తయినా అలంకరణ కావల్సిందేగా! తొందరగా తయారయ్యే చిట్కాలివి. నుదుటి భాగంలో జుట్టు ఊడిపోయి పచ్చిగా కనబడుతుంటే పాపిట మార్చి చూడాలి. జుట్టు వత్తుగా అనిపిస్తుంది. మసాజ్ బ్రష్ పైన హెయిర్ స్ప్రే చల్లి కనుబోమ్మల్ని దువ్వుకొంటే అందంగా కనిపిస్తారు. కళ్ళు ఫ్రెష్ గా అనిపించాలి అనుకొంటే చిన్న ఐస్ ముక్కతో కళ్ళ చుట్టూ మసాజ్ చేయాలి. పెదవులు సహజంగా ఎర్రగా కనిపించాలి అనుకొంటే పంచదార, బాదం నూనె కలిపి మృదువుగా రుద్దేస్తే పెదవుల పైన పగుళ్లు మాయమైపోతాయి. చాలా తేలికైన లిప్ స్టిక్ వేసుకొంటే ఇంకా బావుంటుంది.

Leave a comment