చేతులు అందంగా కనిపిస్తాయి కానీ ఎటొచ్చి చిక్కంతా మోచేతుల విషయంలోనే. నల్లగా, మొరటుగా వుండి ఇచ్చిందిగా వుంటుంది. ఈ నలుపు దూరం చేయాలంటే హోమ్ మేడ్ టిప్స్ ఉపయోగం. ప్రతి రోజు రాత్రి వేళ వేడి చేసిన కోబరి నూనె తో మోచేతుల్ని మర్దనా చేయాలి. ఇందులో వుండే నలుపు తగ్గి నునుపుగా వస్తాయి. సెనగ పిండిలో నాలుగు చుక్కల నిమ్మరసం కలిపి మోచేతులకు రాసుకున్నా ప్రయోజనమే. అరగంట పోయాక చల్లని నీళ్ళతో కడిగేస్తే బావుంటుంది. బంగాళదుంపకూడా చెక్కని ప్యాక్. లాగా పని చేస్తుంది. దుంపని గుండ్రంగా తరిగి మోచేతుల పైన రుద్దాలి. పావు గంట అయ్యాక గోరు వెచ్చని నీళ్ళతో కడిగేస్తే నలుపు తగ్గుతుంది. ఆ ప్రాంతంలో చర్మం మరీ పొడి బారినట్లు అనిపిస్తే బంగాళదుంప రసంలో తేనె కలిపి మోచేతులపై మర్దనా చేస్తే ఫలితం వుంటుంది. స్నానం చేసిన వెంటనే మాయిశ్చురైజర్ అప్లయ్ చేయాలి. కలబంద గుజ్జులో పసుపు కలిపి మోచేతుల దగ్గర మర్ధనా చేస్తే గుజ్జు చేర్మాన్ని తేమగా మారుస్తుంది. నలుపు రంగు పోగొడుతుంది.
Categories
Soyagam

ఇలా చేస్తే మోచేతులు మెరిసిపోతాయి

Leave a comment