ఇంట్లో మిక్సర్ లు, గ్రయిండర్స్ ఇంకా ఎన్నో వంటింటికి ఉపయోగ పడే ఎలక్ట్రానిక్ వస్తువులు అనేకం వున్నాయి కనుక వంట తేలిగ్గా అయిపోటే కొన్ని పదార్ధాలు ముందే చేసి పెట్టుకుంటే పిల్లలున్న ఇంట్లో వంట తేలికై పోతుంది. పచ్చి మిరప కాయలు, ఉప్పు కలిపి గుజ్జు చేసి చిన్ని బాక్స్ ఫ్రిజ్లో పెట్టుకుంటే రెండు రోజులు నిలువ వుంటుంది. పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు చిన్ని బాక్స్ లో పెట్టి ఫ్రిజ్ లో పెట్టచ్చు. పచ్చి కొబ్బరి తురుము ఒక బాక్స్ లో ముతా పెట్టి ఫ్రిజ్ లో వుంచచ్చు. కొబ్బరి తురుము, కరివేపాకులు కలిపి వేయించి ఫ్రిజ్ లో ఉంచొచ్చు. బంగాళా దుంప, కాలీఫ్లవర్ ని ఉడికించి పాక్ చేసి వుంచచ్చు. నిమ్మరసం, టమాటో రసం తీసి ట్రే ల్లో పోసి డీ ఫ్రిజ్ లో ఉంచితే ఎన్నాళ్ళయినా ఉంటాయి. అల్లం వెల్లుల్లి పేస్టు తయ్యారు చేసి వుంచచ్చు. ఫ్రిజ్ లో ఇలాంటివి బుల్లి బుల్లి బాక్స్ ల్లో ఉంచుతూ వుంటే వంట పది నిమిషాలు.

Leave a comment