Categories
షాంపులో కొన్ని పదార్ధలు కలిపి వాడుకుంటే తలకు సంబందించిన సమస్యలు పోతాయి అంటారు ఎక్స్ పర్ట్స్. తల దురదగా ఉంటే షాంపులో కాస్త రోజ్ వాటర్ కలిపి వాడితే పోతుంది. షాంపులో నిమ్మరసం వేసి వాడితే నిర్జీవంగా ఉన్న జుట్టు నిగనిగలాడుతుంది.తేనె కలిపి వాడితే జుట్టుకు తేమ అందుతుంది.జుట్టు ఊడిపోతుంది అనిపిస్తే కొన్ని చుక్కలు అరోమా ఆయిల్ కలిపి వాడితే సమస్య అదుపులోకి వస్తుంది.కలబంద కలిపిన షాంపు వాడుతుంటే జుట్టు సమస్య తగ్గిపోతుంది.ఉసిరి రసం కలిపితే జుట్టు రాలడం తగ్గుతుంది.జుట్టు కుదుళ్ళు చాలా బలంగా ఉంటాయి.