ఎన్ని పర్ఫ్యూమ్స్ వాడిన చెమట వాసన వదలకుండా ఉంటుంది. స్నానం చేసే నీటిలో లావెండర్ రోజ్ మేరీ టీట్రీ ఆయిల్ ఇలా నచ్చిన సువాసన ఎంచుకొని కొన్ని చుక్కలు కలుపుకోవచ్చు. చర్మంపై సూక్ష్మక్రిములు పెరగటమే వాసనకు కారణం. వేపాకులు లేదా టమాటో రసం ఎక్కువగా చెమట పోసే చోట రాసి పది నిమిషాల తర్వాత కడిగేయండి. అలోవెరా లో యాంటీ మైక్రోబియల్ గుణాలున్నాయి ఎక్కువ. అలోవెరా జెల్ లో ముంచిన కాటన్ తో బాహు మూలలను శుభ్రం చేసుకోవాలి. నీటిని తక్కువ తీసుకున్నా అవి శరీరంలోనే ఉండి పోయి దుర్వాసనకు కారణం అవుతాయి. కనీసం రెండు లీటర్లు నీరైనా తాగాలి.

Leave a comment