ఆఫీసుకీ, కాలేజీకి వెళ్ళేటప్పుడు ఫ్యాషన్ గా ఉంటుందని ఎత్తు మడమల చెప్పులేసుకుంటారు. కానీ ఎక్కువ సమయం నడవాల్సి వచ్చినా గబగబా ఏ మెట్లో ఎక్కవలసిన ఈ మడమలతో కష్టమే అయితే కావాలనుకోన్నప్పుడు ఎత్తుగా ఉండేలా, అవసరం లేనప్పుడు లోపలి ముడుచుకునేలా, రన్ వాకబుల్ హై హీల్ షూలు మార్కెట్ లోకి వచ్చాయి. కేలమిన్ హీల్స్, షీలాస్ హీల్స్ పేరుతో వస్తున్న ఈ చెప్పుల అడుగు భాగం, సగం వరకు లేదా, మొత్తం గా లోపలికి మడిచే వీలుంటుంది.  ఇలా ఫ్లాటైపోయే హీల్స్ ని అమ్మాయిలు ఎంతగానో లవ్ చేస్తున్నారు. అస్తమానం ఎత్తు చెప్పులతో మడమ నొప్పులు తెచ్చుకోకుండా ఈ మడిచే చెప్పుల ధీమ్ బావుంది కదూ.

Leave a comment