చీరె అందం పూర్తిగా కనిపించాలి అంటే ఎంచుకొన్న బ్లవుజ్ ట్రెండీగా ఉండాలి. సాధారణంగా శారీ కలర్ లో కాంట్రాస్ట్ కలర్ లో లేదా బంగారు వెండి రంగుల్లో  బ్లవుజ్ తీసుకోవాలి అనుకొంటారు. అయితే ముదురు రంగు చీరెలకు కొద్దిగా లేత రంగు బ్లవుజ్ ను,డిజైన్ శాతం ఎక్కువ ఉంటే బ్రైట్ కలర్ ని ఎంచుకోమంటారు ఫ్యాషన్ డిజైనర్లు. గాఢమైన కంచి పట్టు ఎంచుకొంటే దాన్ని కాస్త డల్ చేయాలను కొంటె బ్లౌజ్ కు వర్క్ చేయించాలి అలాగే ఎంత ఎంబ్రాయిడరీ ఎక్కువ వుంటే అంత గ్రాండ్ అనుకొంటారు కానీ బ్లౌజ్ డిజైన్ కి జారీ తక్కువ గ్లిట్టర్ ఉన్నది వాడాలి అంటారు. కంచి పట్టు చీరెల్లో ప్యూర్ టిష్యూ ప్లెయిన్ బ్లవుజ్ పార్ట్ ఇస్తూ ఉంటారు. దీనికి హై నెక్ ఇచ్చి స్లీవ్స్ తో డిజైన్ చేయించుకోండి అంటారు డిజైనర్లు కానీ ప్రత్యేకమైన నగలు ధరించవలిసి వుంటే బ్లౌజ్ కి ఎంబ్రాయిడరీ హంగులు అనవసరం.

Leave a comment