ఒకప్పుడు ఆడపిల్లలు ఆడుకునేందుకు లక్కపిడతలు వచ్చేవి.అవన్ని దాదాపు ఇంట్లో అమ్మ వంట చేసే పనిముట్లే. వాటితో అమ్మ చేసే వంటలు ఆట ఆడే వాళ్ళు పిల్లలు.ఇప్పుడు ఆట బొమ్మలను ఆడపిల్లలు మగపిల్లలంటూ చేయకండని ఆటబొమ్మల తయారి పరిశ్రమల పై ఒత్తిడి పెట్టాల్సిందిగా ఉద్యమాలు మొదలయ్యాయి.బాలికల లక్ష్యంగా పింక్ గుర్తు వాడోద్దు అంటున్నారు.ఆడపిల్లల కోసం మార్కెట్ చేసే ఆటబొమ్మలలో బేబీ బొమ్మలుంటాయి. పిల్లలు ఆడుకునే వస్తువులు వారు పెద్దయ్యాక సమస్యలన్ని ఆకాంక్షల పై ప్రభావం చూపుతాయని పాశ్చాత్య ఉద్యమకారులు అంటున్నారు. ఇంట్లో పనులు చేసేవి సౌందర్య ఉత్పత్తుల పైన దృష్టిపోనిచ్చే బొమ్మలు ఇస్తే పిల్లలు తమని తాము డాక్టర్లు,శాస్తవేత్తలు,వ్యాపారవేత్తలు,నాయకుల్లా ఉహించుకోలేకపోతారని ఉద్యమకారులు వాదిస్తున్నారు.

Leave a comment