వెబ్ సిరీస్ వల్ల సినిమాల కొచ్చిన నష్టం ఏమి లేదంటోంది రకుల్ ప్రీత్ సింగ్. ప్రతి కథా సినిమాకు సెట్ కాదు . కొన్ని కథలు వెబ్ సిరిస్ కోసం ప్రత్యేకంగా నిలుస్తాయి. ఇలాటి ఒక వేదిక వుంటేనే ఎంతో మంది ప్రతిభావంతులు వెలుగు లోకి వస్తారు. ఈ రోజుల్లో నటీ నటులు సాంకేతిక నిపుణులు ఎవ్వరు ఖాళీ లేరు మరెంతో ముందుకి ఎంతో పని వుంటుంది . దానికి కారణం డిజిటల్ వెదికే. దాని ద్వారా ఇంట్లో కూర్చుని ఉచితంగా సంతోషం పొందుతు ఉన్నపుడు,డబ్బు ఇచ్చి చూసే సినిమా మరింత వినోదం ఇస్తేనే కదా ఎవరైనా చూసేది. అందుకే దర్శకులు రచయితలు మరింత కష్టపడుతున్నారు. మంచి సినిమాలు వస్తున్నాయి కూడా అంటోంది రకుల్ ప్రీత్ సింగ్. మంచి పాత్ర దొరికితే నటిస్తా నంటోంది.

Leave a comment