Categories
Gagana

ఇలాంటి స్కూళ్ళు అనేకం వుంటే

దేశ రాజధాని గురుగ్రామ్ ప్రాంతంలో నివశించే స్నేహలతా హుడా కు 74 సంవత్సరాల వయస్సు. డిల్లీ ప్రభుత్వ పాఠశాలలో 40 ఏళ్ళు టీచర్ గా పనిచేసిన స్నేహలత పదవీ విరమణ తర్వాత నిరుపేద పిల్లలకు చదువు చేపుదామనుకున్నారు. రోజు కూలీలు, చెత్త ఏరుకునే వాళ్ళు, ఇతర బడుగు బలహీన వర్గాల పిల్లల కోసం ఆమె స్కూల్ నడుపుతున్నారు. “గుర్ గావ్ మా” అని ప్రేమగా అందరి చేత పిలుపించుకునే స్నేహలత సామాజిక సేవ నా డిఎన్ఏ లో ఉందంటారు. 12 సంవత్సరాలుగా ఆమె ఈ పాఠశాల నడుపుతున్నారు. 2005 లో 20 మందితో ప్రారంభమైన ఈ స్కూల్ లో ఇప్పుడు 200 మంది పిల్లలున్నారు. ఈ స్కూల్ పిల్లలకు యూనిఫామ్ లు, పుస్తకాలు, స్టేషనరి, భోజనం అన్నీ ఇస్తారు. ఇంగ్లీష్ మీడియంలో భోధన సాగే ఈ స్కూల్లో తైక్వాండో, కుట్లు, అల్లికలు, పెయింటింగ్ వంటి శిక్షణలు కూడా ఇస్తారు.

Leave a comment