ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్  పేట్టిన ఒక సందేశం ఇప్పుడు వైరల్ అవుతుంది .ఈ లాక్ డౌన్ సమయం సెలవు రోజులు కాదు .వంట గదిలో ఎక్కువ సమయం  గడపవలసి మహిళల పై ఎక్కువ భారం మోపకండి .లాక్ డౌన్ కారణంగా కుటుంబ సభ్యులంతా మొత్తం సమయం ఇంట్లోనే ఉండటం ఆమెకు ఎంతో పని పెరుగుతుంది .నిరంతరం ఎదో ఒకటి వంట గదిలో తయారు చేయవలసి వస్తుంది .ఆ సమయంలో ఆమెకు కుటుంబ సభ్యులు సహకరించండి .చిన్ని చిన్ని కోర్కెలు తీర్చండి .ప్రతి పనిలో సాయంగా చేయి అందించండి .ఇలా సాయం అందితే ఇంట్లో అమ్మ , భార్య , అక్క , చెల్లి అందరూ మనకోసం ఎన్నో పనులు సంతోషం గా చేసేందుకు సిద్ధం గా ఉంటారని ట్వీట్ చేసారు .ఇది నిజం ఇల్లాళ్ళకు ఇది ఒత్తిడి సమయం .వాళ్ళకు సాయంగా ఉండకపోతే వాళ్ళు కష్ట పడే మాట వాస్తవం .

Leave a comment