అందరి ఇళ్లలోనూ కిటికీలకు తలుపులకు డోర్ కర్టెన్స్ ఉంటూనే ఉంటాయి. అవి ఎంతగా ఆనందాన్ని ఇస్తాయో వాటి నిర్వహణ సరిగ్గా లేకపోతే అంతగాను హాని చేస్తాయి. పక్క బట్టల్లో తలగడల్లో డస్ట్ మేట్స్ దాక్కుంటాయి. ఒక అంచనా ప్రకారం 30 గ్రాముల దుమ్ములో 14 వేల డస్ట్ మేట్స్ ఉంటాయంటున్నారు డాక్టర్లు. కర్టెన్ లలో ఫంగల్ జాతికి చెందిన అతి సూక్ష్మమైన జీవులు చేరతాయి ఇవి కలిగించే అలర్జిక్ రియాక్షన్ వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి కర్టెన్స్ క్లాత్ లైన, ఫ్యాబ్రిక్ వైనా నెలకోసారైనా వేడినీళ్లతో ఉతికి ఎండలో ఆరవేస్తేనే ఆరోగ్యం.

Leave a comment