దేశం లో చూడవలసిన అద్భుతమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి వాటిలో ఒకటి ఉత్సవ్ రాక్ గార్డెన్ .ఈ రాక్ గార్డెన్ లో ఒకప్పటి సాంప్రదాయ జీవన విధానాన్ని కళ్లకు కట్టేలా చూపించే అందాల బొమ్మలున్నాయి . చక్కని తోట ఆ మధ్యలో అందమైన పల్లెటూరు అక్కడ ఓ సంత కూరగాయలు, దినుసులు అమ్మే వర్తకులు కొనుక్కుంటున్నా పల్లెటూరి ప్రజలు ఇలా ప్రతి దృశ్యాన్ని కళ్ళకు కట్టేలా సృష్టించిన కళాకారుడు టి బి సోలబక్కనవర్. ఈ రాక్ గార్డెన్ కర్ణాటక లోని హవేరి జిల్లా గొటగోడి దగ్గర ఉంది. సోలబక్కనవర్ ఒక పాతకాలపు గ్రామంలో ఉండే రకరకాల వృత్తులు చేసుకునేవాళ్ళను వారితో పాటు వారి ఇల్లు ఆ చుట్టూ వాతావరణాన్ని కూడా ఎంతో సహజంగా తీర్చిదిద్ది దసనూర్  గ్రూప్ కి చెందిన ప్రకాష్ దసనూర్ సహకారంలో సోలబక్కనవర్ ఈ గార్డెన్ లో వెయ్యికి పైగా శిల్పాలున్నాయి. చక్కని పార్క్ ఎండ పొడ తాగాలనివ్వని పెద్ద వృక్షాలు కింద ఈ గార్డెన్ లో శిల్పాలు రంగు పోకుండా ఆకర్షణీయంగా ఉంటాయి .ఈ పల్లెటూరు బయట ఇండోర్ మ్యూజియం లో ఆధునికమైన హోటళ్ళు, కల్యాణ మండపం, ఎమ్యూజ్ మెంట్ పార్క్ కూడా శిల్పాలే సిమెంట్ తో పోతపోసిన ఈ శిల్పాలను చూసేందుకు పర్యాటకులు వస్తారు .ఇంత అందమైన శిల్పాలకు ఎన్నో అవార్డులు వచ్చాయి తప్పకుండా ఈ కదలని ఊరును కళ్లారా చూడండి .

Leave a comment