వాము ఎంతో మేలు చేస్తుంది అంటారు ఆయుర్వేద నిపుణులు జీర్ణశక్తిని పెంచుతుందని, జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తుందని ఇమ్యూనిటీ పెంచుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సీజన్ లో వాము తీసుకోవటం చాలా ప్రయోజనకరం వాము, అల్లం, మిరియాలు, నల్ల జీలకర్ర, మెంతుల తో కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. వామును నీళ్లలో వేసి మరిగించి వడకట్టి తాగినా నేరుగా ఓ స్పూన్ నోట్లో వేసుకొని నెమ్మదిగా నములుతూ రసం మింగుతున్న మంచి ఫలితం ఉంటుంది. ఏదో రూపంగా తప్పనిసరిగా దైనందిన ఆహారంలో భాగం చేసుకుంటే మంచిదంటున్నారు నిపుణులు.

Leave a comment