ఇందూ మల్హోత్రా మహిళ న్యాయవాది. సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ఎంపికైన మొదటి మహిళ .బెంగళూరు లో జన్మించిన ఇందూ మల్హోత్ర లేడీ శ్రీరామ కాలేజ్ నుంచి రాజకీయ శాస్త్రంలో మాస్టర్స్ చేశారు.ఢిల్లీ విశ్వవిద్యాలయం వివేకానంద కాలేజీ లో లెక్చరర్ గా పని చేశారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా పూర్తి చేసి న్యాయవాద వృత్తిలో చేరారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా ఒక్కోదాన్ని ఎదిరిస్తూ సాధికారత సమానత్వం దిశగా ప్రయాణం సాగించిన ఇందు మల్హోత్రా మహిళల సంఖ్య తక్కువగా ఉండే న్యాయరంగంలో తన ప్రత్యేకతని నిరూపించుకొంది.

Leave a comment