ఫ్యాషన్ ప్రపంచం ఎంత శరవేగంతో మారుతున్న ఒక్కసారి కొన్ని రిపీట్ అవుతూనే ఉంటాయి .సాంప్రదాయ అందానికి ఆధునిక సోగసులు అద్దిన ఇండో వెస్ట్రన్ బ్లౌవుజులు మాత్రం ఎప్పటికీ మారని ఫ్యాషన్ అమ్మాయిలు ఇప్పుడు నూలు చీర దగ్గర నుంచి పట్టుచీర వరకు ఏది కట్టుకున్నా రఫుల్,పెప్లమ్ బెల్ జాకెట్, బోట్ నెక్ బ్లవుజు లే ఎంచుకుంటున్నారు. అట్లా ఎంచుకోవటం ఇప్పుడు హాటెస్ట్ ట్రెండ్ మెడ కొంచెం వెడల్పుగా ఉంటే కుచ్చిళ్ళతో చైనీస్ కాలర్ నెక్ వంటివి నప్పుతాయి. కాలేజీలు, సెమినార్లు, ఆఫీస్ లకు ఇవి చక్కగా ఉంటాయి కూడా. కాస్త సన్నగా ఉన్న వాళ్లకి రఫుల్ బ్లవుజు, కాలేజీ పార్టీలు, పుట్టినరోజులు వంటి ప్రతి చిన్న ఫంక్షన్ కు బావుంటాయి .క్రేప్, షిఫాన్,  బ్రాసో, నెట్ చేనేత రకాల చీరెలకు ఈ ఫ్యాషన్ బాగుంటుంది. ఇక క్రేప్ బ్లవుజులు స్లీవ్ లెస్ ప్లెయిన్ చీరెల పైన బావుంటాయి. కాకపోతే చీరె సాదాగా ఉంటుంది కనుక బ్లౌజ్ ఎంబ్రాయిడరీ, ఎసె మెట్రికల్ డిజైన్ లలో ప్రయత్నించాలి .హాండ్ లూమ్ చీరెలయితే పెప్లమ్ బ్లవుజులు బెస్ట్ చాయిస్ .చీరెను బట్టి పొట్టీ పొడవు రకాలు తీసుకోవచ్చు. స్లీవ్ లెస్, త్రీ బై ఫోర్త్ బెల్స్ స్లీవ్స్ ట్రెండీగా బావుంటాయి .బ్యాక్ జిప్, కీ హాల్ బ్లవుజు లు కూడా చీరె అందాన్ని పెంచి చూపెడతాయి. నిజానికి చీరె అందాన్ని పదింతలు పెంచేది దానిపైన వేసుకొనే బ్లవుజు వల్లనే అంటే ఆశ్చర్యం లేదు .

Leave a comment