“అయిగిరి నందిని నందిత మేదిని

విశ్వ వినోదిని నందినుతే
 గిరివర వింధ్య శిరోధి నివాసిని
 విష్ణు విలాసిని జిష్ణునుతే!!

సోదరీమణులూ!!దసరా ఉత్సవాలను అత్యంత శక్తిమంతమైనదిగా,భక్తిగా జరుపుకున్నాం కదా!!
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మ తల్లికి శతకోటి వందనాలు సమర్పిస్తూ దర్శనం చేసుకుని వద్దాం పదండి.
అమ్మవారికి రోజుకో అలంకారం.భక్తులు దసరా శరన్నవరాత్రులలో పోటెత్తుతారు.ఆ తల్లి చల్లని చూపులు కోసం.
అమ్మవారికి మొక్కులు తీర్చుకోవడం,దీక్ష తీసుకోవడం ఆనవాయితీ.ఇక్కడ అన్నప్రాసనలు,పెళ్లిళ్లు వైభవంగా జరుపుకుంటారు.అమ్మవారికి తలనీలాలు సమర్పించుకొని చల్లగా చూడమని మళ్లీ వచ్చి దర్శనం చేసుకుంటామని ప్రార్థిస్తారు.
కనకదుర్గమ్మ పిల్ల-పాపలను కంటికి రెప్పలా కాపాడుతుంది.దసరా ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి తెప్పోత్సవం చూడచక్కని వేడుక.

నిత్య ప్రసాదం: కొబ్బరి,పండ్లు,పాయసం,పులిహోర.

 

-తోలేటి వెంకట శిరీష

Leave a comment