సాధారణంగా ఒత్తిడికి గురయ్యే వాళ్ళే ఊబకాయులవుతారు అంటుంది ఒక పరిశోధన. జపాన్ లోని నేషనల్ ఇన్ స్ట్యూట్ ఫర్ ఫిజియోలాజికల్ సైన్సెస్ చేసిన అధ్యాయనంలో మనిషి బరువు పెరగటంలో మెదడు పాత్ర ఉందని తేలింది, మానసిక ఒత్తిడికి గురైతే శరీరం కార్బోహైడ్రేట్స్ పొగొట్టుకుంటుంది. దానిలో అవసరమైన కార్బోహైడ్రేట్స్ తీసుకోమని మెదడు ప్రోత్సహిస్తుంది. అంతే ఆకలిగా అనిపిస్తుంది. ఇక తినటం మొదలుపెట్టేస్తారు. ఒత్తిడి తగ్గేంతవరకు ఏదైన తినాలనే కోరిక మనిషిని నిలబడనివ్వదు. ఆ సమయంలో స్వీట్లు అందుబాటులో ఉంటె అంతే సంగతులు. లావుగా ఉండే వారిలో ఒత్తిడికి గురయ్యే లక్షణం అధికం అని పరిశోధనలో తేలింది.

Leave a comment