ఒక్కసారి ఏది నిజమో తలుసుకోలేక పోతాం. కానీ తేల్చుకునే ముందు వినాలి కదా చాలా మంది జుట్టు రాలిపోవడానికి ఎన్నో కారణాలు చెపుతారు. జుట్టు కత్తిరించుకుంటే వెంట్రుకలు పెరుగుతాయంటారు. అదేం కాదు, కత్తిరించినా కొత్తగా జుట్టు ఎక్కువేమీ రాదు. ఉన్నదే పెరుగుతుంది అంటారు ఎక్ష్ పర్ట్స్. అలాగే జుట్టు మసాజ్ చేసినా వేగంగా ఎం పెరగదట. పైగా మాడుకు ఎక్కువ సేపు మస్సాజ్ చేస్తే జుట్టు దెబ్బతింటుందట, చుండ్రు వల్ల జుట్టు ఊడిపోతుంది అంటారు కొందరు. కానీ చుండ్రుకి జుట్టు రాలిపోవడాకి శాస్త్రీయ సంబందం ఏవీ లేదు. ఇది కేవలం షాంపూలు అమ్ముకోవడానికి చేసే మార్కెటింగ్ ప్రచారం అంటున్నారు డాక్టర్లు. మాడు పోడి బారితే మాత్రం వెంట్రుకలు చిట్లి రాలిపోతాయట. తరచూ షాంపూ మార్చినా జుట్టు వూడదు. ఒత్తిడికి జుట్టు రాలడానికి ఏ సంబంధం లేదు. చల్లని నిల్లతో స్నానం చేసినా వుదిపోదు. పైగా రక్త ప్రసరణ బాగా జరిగి జుట్టు బాగా పెరుగుతుందిట కూడా. ఇవి నిపుణుల సలహాలే. అవసరం అయ్యినంత వరకు మనశ్శాంతి కోసం, అమ్మాయి జుట్టు రాలదు అనడం కోసం చదువుకోవాలి అంతే.

Leave a comment