ప్రతి చిన్న సందేహానికి, అవసరానికి ఫోన్ మీదకి చేయి పోనిస్తూ ఉంటాం. సందేహం అనిపిస్తే చాలు గూగుల్ లో వెతుకుతాం. ఆగి ఆలోచించే పనికి ఏనాడో స్వస్థి చెప్పాం. కానీ అద్యయనాలు ఈ అలవాటు మనలో ఆలోచన పరిధిని తగ్గిస్తుంది అంటున్నాయి. సొంతంగా ఆలోచించి తెలుసుకో కావలిసిన విషయాలు స్మార్ట్ ఫోన్‌ లో వెతుక్కుని ఒక్క నిమిషంలో ఏ టీవీ సిరియల్‌ లోనో,ఫేస్‌ బుక్‌ లోనో తలదూర్చేస్తే ఆలోచన ప్రక్రియనే మెదడు మానేస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇటు శరీర ఆరోగ్యం అటు మెదడు పనితీరు రెండు దెబ్బతింటాయి. చూసుకోమ్మంటున్నారు ఎక్స్ పర్ట్స్.

Leave a comment