ఎత్తు తక్కువగా ఉన్న అమ్మాయిలు కాస్త పొడవుగా కనిపించాలి అంటే కొన్ని ఫ్యాషన్ టిప్స్ చెబుతున్నారు ఎక్స్ పర్ట్స్. హై వైస్టెడ్ ప్యాంట్లు షర్టులు సూట్లు వేసుకుంటే కాళ్లు పొడవుగా అనిపిస్తాయి. జీన్స్ లేదా పాంట్స్ వేసుకుంటే మ్యాచింగ్ షూస్ వేసుకోవాలి. అలా ఒకే రంగు ప్యాంట్లు షూస్ వేసుకోవటం వల్ల రంగు కలిసిపోయి చూడగానే పొడుగ్గా అని పిలుస్తారు. పాలాజో ప్యాంట్లు లేదా లూజ్ బాటమ్ ప్యాంట్లు మీదకు హిల్స్ మంచి ఎంపిక. చిన్న ప్రింట్లు ఉన్న దుస్తులు ఎంచుకోవాలి. నిలువు గీతల ప్రింట్లు విషేస్ ఉన్న టీ షర్ట్ లు మంచి ఛాయిస్. టాప్ నాట్ హెయిర్ స్టయిల్ తో అస్సలు పొట్టిగా కనిపించరు. జీన్స్ లేదా ఏదైనా డ్రెస్ మీదకు స్టయిల్ కోసం స్కిన్నీ గా ఉండే బెల్ట్ లు మాత్రమే వాడాలి దాంతో చక్కగా పొడవుగా స్టయిల్ గా కనిపిస్తాము.

Leave a comment