ఈ వేసవి ఎండలకు ఎక్కువసేపు వంటగదిలో ఉండటం ఎవరికైనా కష్టమే చిన్న మార్పులతో వంట ఇల్లు చల్లగా చేసేయవచ్చు వంట గది గోడలకు వీలైనంత లేత రంగులు వేసుకుంటే మేలు. వంటగదిలో ఏ కాస్త చోటు ఉన్న కొత్తిమీర ,పుదీనా,మెంతి వంటి చిన్న మొక్కలున్న  కుండీలు పెడితే బాగుంటుంది ఇంట్లోకి గాలి వెలుతురు వచ్చేలా కిటికీలు తీసిపెట్టుకోవాలి ఎగ్జిస్ట్ ఫ్యాన్ లు చిమ్మీలు వల్ల గది వేడిగా ఉండదు వంట కోసం పదార్ధాలన్నీ ముందే సిద్ధంగా పెట్టుకోవాలి. కూరలు తరగడం పూర్తి చేసి మసాలాలు సిద్ధం చేసుకుని అప్పుడు వంట మొదలు పెడితే అది ఉడికే సమయంలో పూర్తయిపోతుంది. రేపు ఉదయం వండబోయే వంటకు కావలసిన వస్తువుల ముందు రోజు రాత్రే సిద్ధం చేసుకోవటం ముఖ్యం వేసవి ఎండలు తగ్గేవరకు వంటగదిలో ఉండే సమయం తగ్గించుకోవాలి.

Leave a comment