టీ తాగే వాళ్ళు ఉత్సహం తో మరిన్ని కప్పులు టీ తాగచ్చు. సింగపూర్ జాతీయ విశ్వవిద్యాలయి నిపుణులు చేసిన పరిశోధనలో టీ తాగని  వాళ్ళతో పోలిస్తే టీ తాగే వాళ్ళలో ఆలోచన శక్తి చాలా బావుందని తేలింది. వయసు మళ్ళిన కొందరిని ఎంపిక చేసి వారి మెదడు స్కాన్ చేసి అధ్యయనం చేస్తే టీ తాగే వాళ్ళలో వయసుతో పాటు వచ్చే కణాల క్షీణత యాభై శాతం తక్కువగా కనిపించింది. ఈ పరిశోధనలో,టీ తాగటం వల్ల ఆరోగ్యం బావుంటుందని హుద్రోగా సమస్యలు చాలా తక్కువగా ఉన్నాయని. ఇప్పుడు కొత్తగా మెదడు ఆరోగ్యం కూడా చాలా బావుందని తేలింది. అంచేత టీ ప్రేమికులు ఓ కప్పు అదనంగా తాగచ్చు అన్నమాట.

Leave a comment