సాధారణ గోధుమల్లో కంటే పదిరెట్లు ఎక్కువగా పీచు వున్న గోధుమల రకాలని  ఆస్ట్రేలియాకు చెందిన CRIRO శాస్త్రవేత్తలు సృష్టించారు. 2006 లో చేపట్టిన ఈ పరిశోధనా ఇప్పుడు విజయవంతం అయ్యింది. గోధుమ లోని రెండు  ఎంజైమ్ల మోతాదు తగ్గిస్తే అమైలోడ అనే పాలిశీకరైడ్  ఎక్కువవుతుందని గుర్తించిన శాస్త్రవేత్తలు ఆధునిక పద్దతుల ద్వారా దీన్ని సాధించారు. గోధుమలో ఒక రకమైన పీచు పదార్ధం 20 శాతానికి చేరుకుంది. ఈ కొత్త వంగడాన్ని ఇప్పటికే అమెరికాకు చెందిన మేస్టేట్ మిల్లింగ్ కంపెనీ సాగుకు సిద్దం చేసింది.

Leave a comment