Categories
ఉప్పు కేవలం రుచి కోసం మాత్రమే . అది తగు మాత్రం మాత్రమే వాడుకోవాలి అంటున్నాయి అద్యాయనాలు. రోజువారి ఆహారంలో చిన్నప్పటి నుంచే కాస్త ఉప్పు తక్కువగా తినటం అలవాటు చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. ఉప్పు తక్కువ తింటే రక్తపోటు అదుపులో ఉంటుంది. కిడ్నీలకు హాని జరగదు. ఉప్పుతో పాటు నూనె, పంచదారల వాడకం కూడా తక్కువగా ఉండాలి. ఆరోగ్యానికి, అనారోగ్యానికి తేడా మనం తినే పదార్దాల వల్లే నిర్ణయించబడుతుంది. పౌష్టిక ఆహారం, సమతుల ఆహారం ఆరోగ్యవంతమైన ఆహారం అందితేనే మానసిక శారీరక శక్తులు లభిస్తాయి.