ఎప్పుడైనా ఎక్కడైనా నేను పని చేయడానికి సిద్ధమే దాని కోసం ఏమైనా చేస్తాను.అలా  చేయాలంటే నన్ను నటిగా మరో మెట్టు ఎక్కించే  గొప్ప పాత్రలు కావాలి అప్పుడు నేనేమిటో మరోసారి చూపిస్తా అన్నది విశ్వ సుందరి సుస్మితా సేన్.  ఆర్య అనే వెబ్ సెరీన్ లో ఆమె ప్రధాన పాత్రలో నటించింది. మాదక ద్రవ్యాలు, రాకెట్, నేపథ్యంలో నడిచే ఈ కథలో  ఆర్య సెరీన్ అన్న మహిళగా సుస్మిత నటించింది.ఈ క్రైమ్ థ్రిల్లర్ లో  ఒక మంచి పాత్ర లభించింది.ఇన్నాళ్ళు ఎదురు చూసిన దానికి ఫలితం లభించింది అంటోంది సుస్మిత. సుస్మిత ప్రధాన పాత్రలో ఈ వెబ్ సిరీస్ హాట్ స్టార్ లో ప్రసారం కానున్నది.

Leave a comment